Balochistan Blast : పాకిస్థాన్‌లో పేలుడు…ఏడుగురి మృతి

83

Balochistan Blast : పాకిస్థాన్ దేశంలో సోమవారం రాత్రి భారీ పేలుడు జరిగింది. బలూచిస్థాన్‌లోని పంజ్‌గూర్ జిల్లాలో సోమవారం రాత్రి ఒక వాహనం లక్ష్యంగా ల్యాండ్‌మైన్ పేల్చారు. ఈ ఘటనలో యూనియన్ కౌన్సిల్ ఛైర్మన్‌తో సహా కనీసం ఏడుగురు మరణించారని పాక్ అధికారులు తెలిపారు. (Balochistan Blast) ఒక వివాహ వేడుక నుంచి తిరిగి వస్తున్న బల్గతార్ యూసీ ఛైర్మన్ ఇష్తియాక్ యాకూబ్, ఇతరులు ప్రయాణిస్తున్న వాహనాన్ని లక్ష్యంగా చేసుకోవడానికి దుండగులు రిమోట్ పేలుడు పరికరాన్ని అమర్చారని పంజ్‌గూర్ డిప్యూటీ కమిషనర్ అమ్జద్ సోమ్రో చెప్పారు. (landmine blast)

వాహనం బల్గతార్ ప్రాంతంలోని చకర్ బజార్ వద్దకు చేరుకోగానే మందుపాతర పేల్చారని, ఫలితంగా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. మృతుల్లో మహ్మద్ యాకూబ్, ఇబ్రహీం, వాజిద్, ఫిదా హుస్సేన్, సర్ఫరాజ్, హైదర్‌ ఉన్నారు. వారు బల్తాగర్ పంజ్‌గూర్‌కు చెందినవారని పాక్ పోలీసులు చెప్పారు.

మృతుల్లో నలుగురిని వారి బంధువులు ఆసుపత్రికి తరలించారు. 2014వ సంవత్సరం సెప్టెంబరులో ఇదే ప్రాంతంలో ఇషాక్ బల్గాత్రి తండ్రి యాకుబ్ బల్గాత్రి, అతని సహచరులు 10 మంది కూడా హత్యకు గురయ్యారు. నాటి దాడికి బలూచ్ లిబరేషన్ ఫ్రంట్ ఈ దాడికి బాధ్యత వహించింది. తాజా పేలుడు ఘటనలో కూడా అదే సంస్థ ప్రమేయం ఉందని అధికారులు అనుమానం వ్యక్తం చేశారు.

Tags

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top