షర్మిల రాజకీయ జీవితం ముగిసినట్లే...

93

వైఎస్ బిడ్డ ఇంత తెలివి తక్కువ రాజకీయాలు చేసి . తన పరుగు ప్రారంభించకుండానే ముగించేస్తారని ఎవరూ ఊహించలేరేమో. షర్మిల పరిస్థితి చూసి పాపం అని వైఎస్ ఫ్యాన్స్ కూడా జాలి చూపిస్తున్నారు.

ఇప్పుడు ఆమెకు కాంగ్రెస్ లో చోటు లేదు. తన పార్టీని మళ్లీ పట్టాలెక్కించలేరు. ఇలాంటి వ్యూహంలో ఆమె స్వయంగా ఇరుక్కుపోయారు. ఇటు కాంగ్రెస్ , అటు జగన్ రెడ్డి పన్ని వ్యూహంలో విలవిల్లాడుతున్నారు.

Also Read: ఈటల రాజేందర్కు తప్పిన ప్రమాదం..

షర్మిల కాంగ్రెస్ లో విలీనం ప్రతిపాదనకు ఒప్పుకుని చర్చలు జరిపారు. కానీ ఆమెను పార్టీలో చేర్చుకునేందుకు తెలంగాణ నేతలెవరూ రెడీగా లేరు. ఆమె అడుగుపెడితే ఉన్నది కూడా ఊడిపోతుదంని కాంగ్రెస్ నేతలు తేల్చి చెప్పారు. అందుకే తెలంగాణ కాంగ్రెస్ పై ఆమె నీడ కూడా పడవద్దని అల్టిమేటం ఇచ్చారు. దీంతో కాంగ్రెస్ హైకమాండ్ ఆమె పోటీపై అసలు చెప్పడం లేదు. పాలేరులో పోటీ చేస్తానని కాన్ఫిడెంట్ గా చెప్పిన ఆమె ఇప్పుడు. తర్వాత చెబుతానని అంటున్నారు. మరో వైపు. ఆమెపై రేణుకాచౌదరి లాంటి వాళ్లు మండిపడుతున్నారు. ఈ వ్యతిరేకత ఎక్కువగా ఉంది. చివరికి హైకమాండ్ ఏ నిర్ణయమూ తీసుకోలేదు. బేషరతుగా విలీనం చేసి కామ్ గా ఉండమని చెబుతారు. అలా చేయడం రాజకీయంగా ఆత్మహత్య చేసుకోవడమే.

మరో వైపు తనకు ఎంత ఓట్లు వస్తాయన్న సంగతిని పక్కన పెట్టి.. ఏ రాజకీయ పార్టీ అయినా ముందుగా బలం పెంచుకునే ప్రయత్నం చేయాలి. పార్టీ ఉంటుందని నమ్మకం కలిగించాలి. కానీ షర్మిల .. చాలా పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టుకుని.. .. మూడు వేల కిలోమీటర్ల వరకూ పాదయాత్ర చేసి.. తెచ్చుకున్న అంతో ఇంతో హైప్ కాస్తా.. ఎటూ కాకుండా పోయింది. చివరికి మరో పులివెందుల అని ప్రకటించుకున్న పాలేరు లో కూడా కనీస ప్రభావం చూపే పరిస్థితి లేదు. అసలు ఆమె పార్టీ ఉంటుందా ఉండదా అన్నది కూడా పట్టించుకోనంతగా తన ప్రభావాన్ని విలీనం చర్చలతో తగ్గించేసుకున్నారు. ఇప్పుడు విలీనం లేకుండా సొంతంంగా పార్టీ పెడితే కనీసం తనకు అయినా డిపాజిట్ వచ్చే పరిస్థితి లేదు.

తన నిర్ణయాలా.. కాంగ్రెస్ పార్టీ ప్లానా. జగన్ ెడ్డి పంజానా అన్నది పక్కన పెడితే.. రాజకీయాల్లో ఇలాంటి వాటిని సమర్థంగా ఎదుర్కొంటేనే రాణిస్తారు. లేకపోతే మొదటికే మోసం వస్తుంది. ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన షర్మిల తనపై అన్ని వైపుల నుంచి వచ్చిన వ్యూహాత్మక దాడికి గురయ్యారు. వాటిని గుర్తించి తనను తాను రక్షించుకోవడంలో విఫలం అయ్యారు. అయితే రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు.. గొప్పగా కమ్ బ్యాక్ ఇవ్వొచ్చు.. కానీ షర్మిల అమాయకంగా చేసిన రాజకీయంతో అలాంటిది కూడా కష్టమేనన్న వాదన ఎక్కువగా వినిపిస్తోంది.

Tags

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top