Bigg Boss Telugu 7: ఎలిమినేషన్ లో శివాజీ కాళ్ళ మీద పడి బోరున ఏడ్చేసిన శోభా శెట్టి

217

నిన్నటి ఎపిసోడ్ లో ఒక ఎలిమినేషన్ ఉంది. అందరు ఊహించిన విధంగానే 14 వారంలో శోభా శెట్టి ఎలిమినేట్ అయ్యింది. నిన్నటి ఎపిసోడ్ లో నాగార్జున ఒకొక్కరిగా ఫైనలిస్ట్ లను అనౌన్స్ చేశారు.

చివరకు శివాజీ, శోభా శెట్టి మిగిలిపోయారు. ఇద్దరినీ యాక్టివిటీ ఏరియాలోకి రమ్మన్నారు నాగార్జున. దాంతో ఇద్దరినీ కాస్త టెన్షన్ పెట్టి చివరకు శోభా శెట్టిని ఎలిమినేట్ అయినట్టు ప్రకటించాడు నాగార్జున . శివాజీకి హగ్ ఇచ్చి ఆల్ ది బెస్ట్ చెప్పింది శోభా.. బయటకు రాగానే అర్జున్ దగ్గరకు వెళ్లి నువ్ అస్సలు కంగారు పడకు.. బయట ఓటింగ్ నేను చూసుకుంటా.. నా ఓటు కూడా నీకే వేస్తాను అంటూ చెప్పుకొచ్చింది. అలాగే అమర్, ప్రియాంక దగ్గరకు వెళ్లి నేను ఏడవకుండా వెళ్తాను అని చెప్పింది. ప్రియాంక మాత్రం తన స్నేహితురాలు వెళ్తున్నందుకు కన్నీళ్లు పెట్టుకుంది. అమర్ అలా చూస్తూ ఉండిపోయాడు.

Also Read: Bigg Boss 7 Telugu: ఓట్లు పడకుండా రైతు బిడ్డపై కుట్ర.. పనిచేయని పల్లవి ప్రశాంత్ ఫోన్ నంబర్

అయితే వెళ్లే సమయంలో ఊహించని విధంగా శివాజీ కాళ్లకు నమస్కరించింది శోభా శెట్టి. కాళ్ల మీద పడి.. అన్నా తెలీకుండా ఏమైనా తప్పు చేసి ఉంటే క్షమించండి.. ఎమోషన్స్ లో ఎదో మాట్లాడి ఉంటాను.. కావాలని కాదు నన్ను క్షమించండి అని చెప్పింది. శివాజీ అలాంటిది ఏమి లేదమ్మా అని అన్నాడు. యావర్ కూడా లాస్ట్ వీక్ జరిగినదానికి శోభాకు సారి చెప్పాడు.

ఇక ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చిన శోభా శెట్టి స్టేజ్ పైకి రాగానే ఎలిమినేషన్ ను తీసుకోలేకపోతున్నా అని చెప్పింది. తన జర్నీ వీడియో చూడగానే వెక్కి వెక్కి ఏడ్చింది. దాంతో నాగార్జున ఆమెను దగ్గరకు తీసుకొని ఓదార్చారు. వెళ్తూ వెళ్తూ ప్రతిఒక్కరిలో ఒక గుడ్ క్వాలిటీ, ఓ బ్యాడ్ క్వాలిటీ చెప్పాలని అన్నాడు నాగ్. దాంతో అర్జున్ కు అన్ని గుడ్ క్వాలిటీలే చెప్పింది.. ఒక్క ఓవర్ థింకింగ్ మాత్రం మనుకోమని చెప్పింది. ప్రియాంకకి కూడా అంతా గుడ్ ఉంది సార్. యావర్ అర్ధం చేసుకోకపోవడం బ్యాడ్ సార్ అని చెప్పింది. నువ్వు నాకేసిన బ్లాంకెట్ నామినేషన్ మాత్రం మర్చిపోను అని ప్రశాంత్ తో సరదాగా అంది. అలాగే శివాజీకి మరోసారి సారి చెప్పింది శోభా.. ఫైనల్ గా అమర్ ను అంతా బ్యాడ్ అంటూ నవ్వులు పూయించింది. కానీ ట్రోఫీ తీసుకొని అనంతపురం వెళ్లిపోవాలి నువ్వు అని అమర్ కు చెప్పింది శోభా శెట్టి

Tags

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top