తాళి కట్టు శుభవేళ.. అడ్డం తిరిగిన పెళ్లి కూతురు

142

పెళ్లి కూతురు మెడలో పెళ్లికొడుకు తాళి కట్టే ముందు 'ఆపండి' అని హీరో లేదా విలన్ లేదా ఇంకెవరైనా గట్టి అరవడం సినిమాల్లో చూస్తుంటాం. వరుడితో పెళ్లి తనకు ఇష్టం లేదని వేరే వ్యక్తిని ప్రేమించానని చెబుతుంటారు కొందరు వధువులు.

మరికొందరు ఈ వరుడిని పెళ్లి చేసుకోనని తాళి కట్టే ముందు చెప్పి షాక్ ఇస్తారు. అచ్చం ఇలాంటి ఘటనే ఒకటి కర్ణాటకలో జరిగింది. తాళి కట్టబోయే ముందు తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని వరుడుకి షాక్ ఇచ్చింది ఓ పెళ్లికూతురు.

Also Read: TS Ministers: తెలంగాణ ఐటి మినిస్టర్

చిత్రదుర్గ జిల్లాలోని హోసదుర్గ తాలూకాలోని చిక్కబ్యాలదకెరె గ్రామానికి చెందిన ఓ యువకుడికి.. ఓ యువతితో పెద్దలు పెళ్లి సంబంధం కుదుర్చారు. వీరి పెళ్లికి గురువారం (డిసెంబరు 12)న ముహుర్తంగా నిర్ణయించారు. ఈ క్రమంలో వరుడి కుటుంబ సభ్యులు గ్రాండ్​గా పెళ్లి ఏర్పాట్లు చేశారు. చిక్కబ్యాలదకెరెలోని భైవవేశ్వర్ కళ్యాణమండపానికి వరుడు, వధువు కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు వచ్చారు. పెళ్లి తంతులో భాగంగా బంధువుల సమక్షంలో పెళ్లి కూతురు మెడలో పెళ్లి కొడుకు తాళి కట్టేందుకు సిద్ధమయ్యాడు.

Also Read: న్యాయంగా ఆ పదవి నాకు దక్కాలి- ఉత్తమ్ సంచలన వ్యాఖ్యలు

తన మెడలో మంగళసూత్రాన్ని కట్టించుకునేందుకు వధువు నిరాకరించింది. తనకు పెళ్లి ఇష్టం లేదని చెప్పింది. అక్కడ ఉన్నవారంతా ఆమెకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అయినా పెళ్లి కూతురు ఎవరి మాట వినిలేదు. ఇదంతా జరుగుతుండగానే పెళ్లి కొడుకు షాక్ అయ్యాడు. తాళి పట్టుకుని.. నిల్చుని చూస్తుండిపోయాడు. వధువు మొండికేయడంతో చివరకు పెళ్లి ఆగిపోయింది.

వధువు తీరుపట్ల వరుడి కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వధువు కుటుంబ సభ్యులతో గొడవకు దిగారు. చివరకు ఈ విషయం శ్రీరాంపుర్​ పోలీస్ స్టేషన్​కు చేరింది. పెళ్లికి అయిన ఖర్చులు వధువు తరఫువారే భరించుకోవాలని పోలీసులు ఇరువర్గాల మధ్య రాజీ కుదర్చడం వల్ల గొడవ సద్దుమణిగింది. పెళ్లి ఇష్టం లేదని ముందే చెప్పవచ్చు కదా.. పెళ్లి ఏర్పాట్లు చేసిన తర్వాత ఇలా అందరి ముందు చెప్పడం ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోసల్ మీడియాలో వైరల్ గా మారింది

Tags

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top