Ajith : అజిత్‌కి చాలా సర్జరీలు జరిగాయి.. పక్షవాతం వచ్చే అవకాశం ఉంది.. అయినా..

37

Ajith : తమిళ్ స్టార్ హీరో అజిత్ గురించి అందరికి తెలిసిందే. తమిళ్(Tamil) లో ఎక్కువమంది అభిమానులు ఉన్న హీరోలలో అజిత్ ఒకరు. అజిత్ సినిమా వచ్చింది అంటే చాలు థియేటర్స్ వద్ద పండగే. అజిత్ మాత్రం కేవలం సినిమాలు చేసేసి వెళ్ళిపోతాడు. ఎక్కువగా బైక్ రైడింగ్స్(Bike Ridings) చేస్తూ, విదేశాలలో తిరుగుతూ ఉంటాడు. సినిమా ప్రమోషన్స్ లో కూడా పాల్గొనడు. కానీ అభిమానుల కోసం, సినిమా కోసం ఎంతటి హార్డ్ వర్క్ అయినా చేస్తాడు.

అయితే అజిత్ బైక్ రేసింగ్స్ వల్ల, సినిమాల్లో జరిగిన కొన్ని ప్రమాదాలతో అతనికి కొన్ని సర్జరీలు జరిగాయి. అయినా ఎప్పటికప్పుడు హెల్త్ మీద ఫోకస్ చేస్తూ ముందుకి వెళ్తున్నాడు అజిత్. తాజాగా ఒకప్పటి తమిళ నటుడు అబ్బాస్ అజిత్ హెల్త్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు.

తమిళ హీరో అబ్బాస్ తన మొదటి సినిమా ప్రేమ దేశం(Prema Desham)తోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత వరుసగా తమిళ్, తెలుగు, మలయాళం సినిమాలలో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలు చేశాడు. 2015 నుంచి సినిమాలకు బ్రేక్ ఇచ్చి ఫారిన్ వెళ్ళిపోయి జాబ్ చేసుకున్నాడు అబ్బాస్. ఇటీవలే చెన్నై(Chennai)కి రావడంతో పలు తమిళ యూట్యూబ్ ఛానల్స్ కి ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు.

తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తమిళ హీరోల గురించి మాట్లాడాడు. ఈ నేపథ్యంలో హీరో అజిత్ గురించి మాట్లాడుతూ.. అజిత్ కూడా నాలాగే. ఏదైనా విషయాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్తాడు. అతనికి అబద్దాలు చెప్తే నచ్చదు. అది తప్పయినా సరే నిజమే చెప్పాలి. ఇప్పటికే అజిత్ కి అనేక సర్జరీలు జరిగాయి. వాటి వల్ల అజిత్ కి పక్షవాతం కూడా వచ్చే అవకాశం ఉందని డాక్టర్లు హెచ్చరించారు. అయినా అజిత్ వాటిని లెక్కచేయకుండా అభిమానుల కోసం సినిమాలు చేయడానికి కష్టపడతాడు. తన కోసం రేసింగ్ చేస్తూ ఉంటాడు అని తెలిపాడు. దీంతో అబ్బాస్ చేసిన వ్యాఖ్యలు అజిత్ అభిమానుల్లో చర్చగా మారాయి.

Tags

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top