వైభవంగా వంగవీటి రాధా నిశ్చితార్దం

73

టీడీపీ నేత వంగవీటి రాధా పెళ్లి పీటలు ఎక్కనున్నారు. రాధా - పుష్ఫవల్లి వివాహ ముహూర్తం ఖరారైంది. గత నెలలోనే రాధా వివాహ వార్త బయటకు వచ్చింది. ఈ రోజు నర్సాపురంలో ఇరు వైపుల బంధువుల సమక్షంలో నిశ్చితార్ధ వేడుక వైభవంగా నిర్వహించారు. రాజకీయాలకు అతీతంగా నిశ్చితార్ధ వేడుకకు పలువురు హాజరయ్యారు.

అక్టోబర్ 22వ తేదీ సాయంత్రం వంగవీటి రాధా వివాహం జరగనుంది. దీంతో, అభిమానుల్ల జోష్ మొదలైంది.

వంగవీటి రాధాకృష్ణ నర్సాపురం మున్సిపల్ మాజీ చైర్పర్సన్ జక్కం అమ్మానీ బాబ్జి దంపతుల ద్వితీయ కుమార్తె పుష్పవల్లిలా నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది. ఈ నిశ్చితార్థ వేడుకలో రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు, మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు, జనసేన పార్టీ ఇంచార్జి బొమ్మిడి నాయకర్ తో పాటు నరసాపురం కు చెందిన పలువురు రాజకీయ నాయకులు పాల్గొన్నారు.

పుష్పవల్లి తల్లి జక్కం అమ్మాని 1987-92 వరకు నరసాపురం మున్సిపాలిటీ టిడిపి చైర్ పర్సన్‌గా బాధ్యతలు నిర్వహించారు. కాలేజ్ విద్యాభ్యాసం అంతా నరసపురంలోనే జరిగింది. ఉన్నత విద్య హైదరాబాడ్ లో పూర్తి చేసారు. హైదరాబాద్ లో యోగా టీచర్ గానూ పని చేసారు.

పుష్పవల్లి తండ్రి టీడీపీ లో సుదీర్ఘ కాలం పోషించారు. మధ్యలో కొంత కాలం హైదరాబాద్ కు వెళ్లిపోయారు. తిరిగి నర్సాపురం వచ్చి అక్కడే ఇంటి నిర్మాణం చేపట్టారు. కొంత కాలం క్రితం జనసేనలో చేరారు. రాజకీయంగా తిరిగి యాక్టివ్ అయ్యారు. గత నెలలో పవన్ కల్యాణ్ ఉభయ గోదావరి జిల్లాల్లొ వారాహి యాత్ర సమయంలో నర్సాపురంలో ఉన్న సమయంలో వీరి ఇంటిలోనే బస చేసారు.

Tags

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top