Eris : కరోనా డేంజర్ బెల్స్.. శరవేగంగా వ్యాపిస్తున్న కోవిడ్ కొత్త వేరియంట్, లక్షణాలు ఇవే.. ఆసియా దేశాలకు పొంచి ఉన్న ముప్పు

44

New Covid Variant : కరోనా సృష్టించిన విలయం అంతా ఇంతా కాదు. యావత్ ప్రపంచాన్ని ఈ మహమ్మారి గడగడలాడించింది. అనేక దేశాలు కరోనా దెబ్బకు విలవిలలాడాయి. లక్షలాది మందిని ఈ వైరస్ పొట్టన పెట్టుకుంది. ఇది చాలదన్నట్లు ఇంకా కరోనా మహమ్మారి కొత్త కొత్త రూపాల్లో మనుషులను వెంటాడుతోంది. ఇబ్బందులకు గురి చేస్తోంది. తాజాగా యూకేలో(UK) వెలుగుచూసిన కరోనా కొత్త వేరియంట్ ఎరిస్(New Corona Variant Eris) కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. యూకేలో శరవేగంగా వ్యాపిస్తూ వెన్నులో వణుకు పుట్టిస్తోంది.

దీనికి EG.5.1(ఎరిస్) అని పేరు పెట్టారు. ఇది సోకిన వారికి ఎక్కువగా ఒమిక్రాన్ లక్షణాలే ఉన్నాయని సైంటిస్టులు చెబుతున్నారు. ఆగకుండా ముక్కు కారడం, తుమ్ములు, తలనొప్పి, గొంతు నొప్పితో బాధపడుతున్నారని తెలిపారు. ఈ వేరియంట్ చాలా బలంగా ఉందని, దీని వ్యాప్తిని జాగ్రత్తగా పరిశీలిస్తున్నామని వెల్లడించారు. ఈ కొత్త వేరియంట్ ఆసియా దేశాల్లో విజృంభించే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

కరోనా మహమ్మారి నుంచి రిలీఫ్ లభించింది అని ఊపిరిపీల్చుకునే లోపే.. కోవిడ్ కొత్త రకాలు ఉద్భవించాయి. మే నెలల మొదటిసారిగా గుర్తించబడిన EG.5.1 లేదా Eris యూకేలో కోవిడ్ కేసుల సంఖ్యను పెంచుతోంది. ప్రస్తుతం యూకేలో 10 కోవిడ్ కేసుల్లో ఒకటి ఈ తాజా స్ట్రెయిన్ కారణంగా ఉన్నాయి. దీని కారణంగా ఆసుపత్రిలో చేరే వారి సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా వృద్ధులపై ఎక్కువగా ప్రభావం ఉది.

ఒమిక్రాన్ రకానికి చెందిన, కోవిడ్ -19 వైరస్ కంటే వేగంగా వ్యాపించే ఈ కొత్త జాతిపై నిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే, EG.5.1 మునుపటి స్ట్రెయిన్ కంటే ప్రమాదకరమైనదని చెప్పడానికి ఎటువంటి కారణం లేదంటున్నారు. మునుపటి ఇన్ఫెక్షన్‌లు లేదా టీకాల నుండి రోగనిరోధక శక్తి క్షీణించడం వల్ల కేసుల పెరుగుదలకు కారణం కావచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వైరస్‌కు వ్యతిరేకంగా రక్షణను నిర్మించడానికి బూస్టర్ షాట్‌లు తీసుకోవడం చాలా ముఖ్యం అంటున్నారు.

”రుతువులు మారుతున్నాయి. కోవిడ్ వైరస్ వ్యాప్తి చెందుతూనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా కొత్త వేరియంట్లు వెలువడుతూనే ఉన్నాయి. ఇటీవలి వేరియంట్‌లలో ఒకటి ఎరిస్ వేరియంట్. ఇది UK నుండి బయటకు వచ్చినట్లు గుర్తించబడింది. యూకేలో నమోదవుతున్న 10 కోవిడ్ కేసుల్లో ఒకటి ఎరిస్ వేరియంట్ కేసు ఉంటోంది. టీకాలు వేసినప్పటికీ ఆసుపత్రిలో చేరే వృద్ధులు సంఖ్య ఎక్కువగా ఉంది. 2019లో వచ్చిన ఒరిజినల్ కోవిడ్ 19 వైరస్‌తో పోలిస్తే ఇది ఒమిక్రాన్ వేరియంట్‌లో గణనీయంగా పరివర్తన చెందింది” అని రోటరీ క్లబ్ ఆఫ్ మద్రాస్ నెక్స్ట్‌జెన్‌లో కరోనా-వైరాలజిస్ట్. కోవిడ్ అవగాహన నిపుణురాలు డాక్టర్ పవిత్ర వెంకటగోపాలన్ చెప్పారు.

కొత్త కోవిడ్ వేరియంట్ ఎరిస్ లక్షణాలు..
* ముక్కు కారడం
* తుమ్ములు
* దగ్గు
* జ్వరం
* అలసట

నివారణ చర్యలు..
బూస్టర్ షాట్ లు తీసుకోవాలి. ఏవైనా లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవాలి అని నిపుణులు సూచించారు. “మేము ఈ వేరియంట్ యొక్క వ్యాప్తిపై ఫోకస్ పెట్టాం. చికిత్స, నివారణ చర్యలు కొనసాగుతాయి. టీకాలు వేయించుకోని వారు వెంటనే తీసుకోవాలి. ఇప్పటివరకు చేయకపోతే బూస్టర్ షాట్లు తీసుకోవాలి. లక్షణాలు ఉన్న వ్యక్తులను వేరుగా ఉండాలి. అవసరమైతే పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది. మరీ ముఖ్యంగా, ఇప్పుడు పాఠశాలలు పూర్తి స్థాయిలో ప్రారంభమైనందున, కేసుల సంఖ్య పెరుగుతోంది. అయితే ఇది ఆసుపత్రిలో చేరికలకు దారి తీస్తుందా లేదా చెప్పలేము” అని నిపుణులు చెప్పారు.

Tags

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top