అప్పు చేసి భార్యను చదివించాడు.. ఉద్యోగం రాగానే ప్రియుడితో లేచిపోయింది!

75

ఉత్తరప్రదేశ్‌కి చెందిన జ్యోతి మౌర్య కేసు తరహాలోనే, జార్ఖండ్‌లోని గొడ్డాలో కూడా ఓ ఉదంతం వెలుగులోకి వచ్చింది. గొడ్డాలో ఓ డెలివరీ బాయ్ రూ.2.5 లక్షలు అప్పు తీసుకుని తన భార్యను నర్సింగ్ కోర్సు చదివించాడు.

అయితే భార్య అతనికి ద్రోహం చేసి ప్రియుడితో కలిసి పారిపోయింది. ఇప్పుడు భార్య స్వార్థం, మోసం అనే అంశం వైరల్ అయ్యింది. ఈ విషయమై టింకు యాదవ్ తన భార్య, ఆమె ప్రేమికుడిపై సిటీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

గొడ్డ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కథౌన్ గ్రామానికి చెందిన బాధితుడు టింకు యాదవ్, నగరంలోని బధౌనా ప్రాంతానికి చెందిన ప్రియా కుమారిని వివాహం చేసుకున్నట్లు చెప్పాడు. పెళ్లయ్యాక భార్య మరింత చదవాలనుకుంది. ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉన్నా, టింకూ ఆమె భవిష్యత్తు బాగుంటుందని భావించి ఆమెను చదివించేందుకు ఒప్పుకున్నాడు.

Also Read : బావతో ఏడడుగులు.. పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చిన మంగ్లీ

టింకూ తన భార్యను శకుంతల నర్సింగ్ స్కూల్‌లో నర్సింగ్ కోర్సు (Auxiliary Nursing Midwifery - ANM)లో చేర్చాడు. సుమారు రూ.2.5 లక్షల అప్పు తీసుకుని చదువు పూర్తి చేయించాడు. పెళ్లయిన ఏడాదిన్నర తర్వాత టింకూ భార్య, చదువుకుంటూనే పొరుగువాడైన దిల్‌ఖుష్‌ రౌత్‌తో ప్రేమలో పడింది. కోర్సు పూర్తయిన వెంటనే టింకూ భార్య అతన్ని వదిలి, ప్రియుడితో కలిసి పారిపోయింది. ఈ విషయం టింకూకి ఆలస్యంగా తెలిసింది. అప్పు చేసి, తన భార్యను నర్సింగ్ కాలేజీలో చేర్పించి, ANM పట్టా ఇప్పించానని టింకు కుమార్ ఆవేదన చెందుతున్నాడు. రాత్రి పగలు కష్టపడి కాలేజీ ఫీజు కడితే, ఆమె ఇలా చేసిందని అంటున్నాడు.

Also Read: ధోని ని కలిసిన రామ్ చరణ్.. అందుకోసమేనా..?

సెప్టెంబర్ 17న కాలేజీకి సెలవుల తర్వాత తన భార్య ప్రియా కుమారి, ప్రేమికుడితో కలిసి ఢిల్లీకి పారిపోయిందనీ, అక్కడ కోర్టులో పెళ్లి చేసుకుని, పెళ్లి ఫొటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిందని టింకూ చెప్పాడు. గత సెప్టెంబర్ 24న టింకూకు ఈ వార్త తెలిసింది. ఇది తెలియగానే తన హృదయం ముక్కలైందనీ, మనస్సుపై తీవ్ర ప్రభావం చూపిందనీ టింకూ చెప్పాడు. తన భార్య నమ్మకద్రోహం చేసిందంటూ టింకూ సిటీ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఆమె, ఆమె ప్రియుడిపై కంప్లైంట్ ఇచ్చి, తనకు న్యాయం చెయ్యాలని వేడుకున్నాడు. ఈ వార్త వైరల్ అవ్వడంతో, రెండు కుటుంబాల మధ్యా ఉద్రిక్త పరిస్థితి ఉంది.

Tags

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top