అత్యవసరంగా డబ్బులు కావాలా? అయితే ఇలా విత్‌డ్రా చేసుకోండి

148

ఉద్యోగం చేసే అందరూ దాదాపు పీఎఫ్ అకౌంట్ మెయింటెయిన్ చేస్తూనే ఉంటారు. దీంట్లో భాగంగా మన వేతనం నుంచి ప్రతి నెలా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) అకౌంట్‌కు 12 శాతం వెళ్తుంది. యాజమాన్యం కూడా అంతే మొత్తంలో జమ చేస్తుంది. ఇక మన పీఎఫ్ అకౌంట్‌లో నగదుపై వడ్డీ కూడా వస్తుంది. ఇంకా పీఎఫ్ నగదును మనం విత్‌డ్రా చేసుకునేందుకు అవకాశం ఉంటుంది తెలుసా.. వేర్వేరు కారణాలతో నిర్దిష్ట మొత్తం తీసుకోవచ్చు.

అన్ని కారణాలకు ఒకేలా డబ్బులు రావు. పీఎఫ్ చందాదారులు వెల్లడించే కారణాన్ని బట్టి పర్సంటేజీ మారుతుంటుంది. అయితే ఇక్కడ పెళ్లి కోసం 50 శాతం వరకు డబ్బుల్ని డ్రా చేసుకోవచ్చని ఈపీఎఫ్‌ఓ చెబుతోంది. దీనికి మాత్రం కొన్ని షరతులు కూడా వర్తిస్తాయి.

Also Read: ఒకేసారి చేతికి రూ.64 లక్షలు.. ఆడపిల్లలకు సూపర్ స్కీమ్..

పెళ్లి కోసం 50 శాతం పీఎఫ్ నగదు తీసుకోవాలంటే.. ఏడేళ్ల సర్వీస్ కాలం పూర్తయి ఉండాలి. అప్పుడు మాత్రమే 50 శాతం విత్‌డ్రా చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఈపీఎఫ్ సభ్యుడు, వారి కుమారుడు లేదా కుమార్తె, సోదరుడు లేదా సోదరి పెళ్లి కోసం PF అకౌంట్‌లో జమైన మొత్తం నుంచి 50 శాతం బయటికి తీయొచ్చు. ఇంకా పెళ్లి, విద్య కోసం 3 సార్ల కంటే ఎక్కువ అడ్వాన్స్ తీసుకొని ఉండొద్దు.

Tags

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top